మళ్ళీ ప్రేమలో పడ్డ అఖిల్..!!

Spread the love

అక్కినేని మూడో తరం చివరి వారసుడుగా వెండి తెరపై అడుగు పెట్టిన హీరో అఖిల్ అక్కినేని. అఖిల్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.. దీంతో తన రూటు మార్చి లవ్ జోనర్ తో హలొ, మజ్ను సినిమాలను చేశాడు.. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు..ఓ వైపు అన్న చైతు కెరీర్ లో దూసుకుపోతుంటే.. అఖిల్ మాత్రం ఇంకా సక్సెస్ కోసం దారులు వెదుకుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో అఖిల్ నాలుగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. బొమ్మరిల్లు సినిమా తర్వాత హిట్ ఖాతా తెరవని.. భాస్కర్ ఈసారి అఖిల్ తో హిట్ కొట్టాలని కసిగా కథను రెడీ చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కూడా ప్రేమకథ తోనే ఉందనున్నదని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించనున్నారు.

Please follow and like us:

Facebook Comments

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*