ప్రముఖ దర్శకుడు హీరో గా..

Spread the love

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన వినాయక్‌ హీరోగా ఓ చిత్రంలో నటిస్తుండడంతో అభిమానులు సర్‌ప్రైజ్‌కు గురయ్యారు. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్‌. నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఈయన ‘శరభ’ అనే సినిమాను తెరకెక్కించారు. మరో రెండు నెలల్లో చిత్రీకరణ ప్రారంభం అవుతుందని చిత్రవర్గాలు వెల్లడించాయి. 2018లో వచ్చిన ‘ఇంటెలిజెంట్‌’ సినిమాకు వినాయక్‌ చివరగా దర్శకత్వం వహించారు. సాయి ధరమ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని ప్రకటించారు.

Please follow and like us:

Facebook Comments

About Surya Kala 73 Articles
Surya is a senior journalist, has more than 15 years of experience in Telugu journalism. She used to write movie news in Telugu language. You can give us feedback of her writing at Gomoviemamaa@gmail.com

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*