బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా కింగ్.. కండిషన్స్ అప్లై !!

Spread the love

తెలుగు లో బిగ్ బాస్ షో సీజన్ 3 కి హోస్ట్ కోసం మా టివి యాజమాన్యం వేట సాగిస్తోంది.. సీజన్ 1 లో ఎన్టీఆర్, సీజన్ 2 లో నాని లు హోస్ట్ గా చేశారు.. ఇక ఎన్టీఆర్ యాంకరింగ్ కు బుల్లి తేరా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టగా.. నాని మాత్రం ఆకట్టుకోలేక పోయాడు.. దీంతో సీజన్ 3 కోసం సీనియర్ హీరో కింగ్ నాగార్జున వైపు బిగ్ బాస్ నిర్వాహకుల చూపు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు షో తో బుల్లి తేర ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా బాగుంటుంది అని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మన్మధుడు సీక్వెల్ కోసం ఇజ్రాయిల్ లో ఉన్న నాగార్జునని స్టార్ మా యాజమాన్యం రాయబారులను పంపించారని ఫిల్మ్ నగర్ టాక్..

నాగార్జునని ఈ షోకి హోస్ట్ గా వ్యవహించడమని చాలా కష్టపడి అంగీకరింపజేసినట్లు చేబుతున్నారు. అదే నాగ్ కొన్ని కండిషన్స్ అప్లై అన్నారట.. బిగ్ బాస్ షో సెట్ తన అన్నపూర్ణ స్టూడియోస్ లో వేయాలని, బయట ఊళ్లకు వచ్చి తనకు షో నిర్వహించే ఖాళీ లేదని చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ షోను హోస్ట్ చేసినందుకు తనకు పారితోషికంగా 15 కోట్లు పారితోషికం కావాలని నాగ్ పెట్టిన కండిషన్స్ కూడా అంగీకరించినట్లు టాక్. ఈనెల మూడవ వారంలో నాగార్జున తన ‘మన్మధుడు 2’ షూటింగ్ ముగించుకుని ఇజ్రాయిల్ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత ఈవిషయమై స్టార్ మా నాగార్జునతో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.. మరి ఈ పుకారు కనుక నిజం ఐతే.. సీజన్ 3 లో పార్టిసిపెంట్స్ పై మంచి అంచనాలు ఏర్పడతాయని చెప్పవచ్చు

Please follow and like us:

Facebook Comments

About Surya Kala 73 Articles
Surya is a senior journalist, has more than 15 years of experience in Telugu journalism. She used to write movie news in Telugu language. You can give us feedback of her writing at Gomoviemamaa@gmail.com

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*