మూకీ లఘు చిత్రం “రాయల్ ఎంఫిల్డ్”

Spread the love

ప్రసాద్ రాజ్ కథానాయకుడుగా నటించిన మూకీ లఘు చిత్రం “రాయల్ ఎంఫిల్డ్ ”. మహేష్ పాశం దర్శకత్వంలో కే కే క్రియేషన్స్ బ్యానర్‌పై రాజశేఖరం తణుకు నిర్మించిన ఈ మూకీ లఘు చిత్రాన్ని యూట్యూబ్ లో విడుదల చేసారు. ఇప్పటికే ఈ మూకీ లఘు చిత్రం చాలా బాగా వచ్చిందని మహేష్ పాశం హర్షం వ్యక్తం చేసారు. అంతేకాకుండా తనకు ఈ అవకాశం ఇచ్చిన కే కే క్రియేషన్స్ సంస్థకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ చిత్రం లో ప్రసాద్ రాజ్ చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసారు. ప్రసాద్ రాజ్ కి ఇండస్ట్రీ లో మంచి భవిష్యత్ ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు. ఈ సందర్భం గా ప్రసాద్ రాజ్ మాట్లాడుతూ .. ఈ అవకాశం ఇచ్చిన కే కే క్రియేషన్స్ కి, రాజశేఖరం గారికి, మరియు డైరెక్టర్ మహేష్ పాశం గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ షార్ట్ ఫిలిం లో ఒక అబ్బాయికి రాయల్ ఎంఫిల్డ్ బైక్ పై వున్నా ఇష్టాన్ని , ఆ బైక్ని కొనటానికి పడిన కష్టాన్ని చూపించారు. చివరికి ఎలా సొంతం చేసుకున్నాడు అన్నది కాన్సెప్ట్ . ప్రస్తుతం ఇదే బ్యానర్ లో అసమర్థుని జీవయాత్ర, పెదవి దాటని ప్రేమ ,కృష్ణానగర్ అడ్డా మరియు అహం అనే నాలుగు కాన్సెప్ట్స్ తో బిజీ గా వున్నానని అన్నారు.

Please follow and like us:

Facebook Comments

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*