సరిలేరు నీకెవ్వరూ..

Spread the love

ప్రస్తుతం మహర్షి సినిమాను పూర్తి చేసిన సూపర్‌ స్టార్ మహేష్ బాబు, తరువాత చేయబోయే సినిమాను..,వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు మహేష్. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాకు ఇంట్రస్టింగ్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఇప్పటి వరకు తన సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్‌ను మాత్రమే పెడుతూ వస్తున్న అనిల్‌, మహేష్ సినిమాకు అచ్చమైన తెలుగు టైటిల్‌ను పెట్టేందుకు ట్రై చేస్తున్నాడు. మహేష్ ఇమేజ్‌కు తగ్గట్టుగా “సరిలేరు నీకెవ్వరూ” అని టైటిల్‌ను ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. మహేష్ ఓకె చెప్తే ఇదే టైటిల్‌ను కన్ఫామ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

Please follow and like us:

Facebook Comments

About Prasad Raj 91 Articles
Prasad raj is a short films writer come actor. who regularly appears on the youtube short films. he is having a talent to articulate the content about all movies ,gossips and the trending news in film industry as he already in touched with film industry people.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*