Tuesday, July 27

Rashmika Mandanna 2020 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్.. రష్మిక మందన్న..!

Rashmika Mandanna

2020 బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కన్నడ భామ రష్మిక మందన్న టాప్ 1 గా నిలిచింది.

కన్నడ కిరాక్ పార్టీతో హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక తెలుగులో ఛలోతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో కెరియర్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.

స్టార్స్ తో కూడా ఛాన్స్ అందుకుంటున్న అమ్మడు కమర్షియల్ సినిమాల్లో కూడా తన మార్క్ చూపిస్తుంది. ఇక లేటెస్ట్ గా బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ లో టాప్ 1 గా నిలిచింది.

2020లో నేషనల్ క్రష్ గా అవార్డ్ తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా అవార్డ్ అందుకుంది. సినిమాలతో అలరించడమే కాదు ఇలా డిజైరబుల్ అవార్డులతో కూడా రష్మిక తన ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది.

మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 అవార్డ్ అందుకున్న Rashmika Mandanna స్పందిస్తూ మీ ప్రేమకు ధన్యవాదాలు.. పరిస్థితులు కొద్దిగా కుదటపడ్డాక మంచి పార్టీ చేసుకుందాం.

ఎక్కడ కెరియర్ మొదలు పెట్టానో అక్కడ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నా అంటూ టచింగ్ కామెంట్ పెట్టింది రష్మిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *