Thursday, June 24

ఇది దేవరకొండ మార్క్ ‘పుష్పక విమానం’..!

అన్న విజయ్ దేవరకొండ స్టార్ క్రేజ్ తెచ్చుకోగానే తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా మారాడు. దొరసాని సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ ఆ సినిమాతో నిరాశపరచినా సెకండ్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మాత్రం మంచి హిట్ అందుకున్నాడు. 2020లో ప్రేక్షకులు మెచ్చిన సినిమాలో ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ ఒకటి. వినోద్ అనంతోజు ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు.

ఇక ఈ సినిమా తర్వాత ఆనంద్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తన నెక్స్ట్ సినిమాను కూడా డిఫరెంట్ కథతోనే వస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. దామోదర అనే నూతన దర్శకుడు చేస్తున్న సినిమాలో నటిస్తున్నాడు తమ్ముడు దేవరకొండ. ఈ సినిమాకు టైటిల్ గా పుష్పక విమానం అని ఫిక్స్ చేశారు. కమల్, సింగీతం కాంబోలో వచ్చిన సూపర్ మూవీ ఇది. మూకీ సినిమాగా అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. కమల్ సినిమా టైటిల్ వాడాలంటే సాహసం అన్నట్టే.

అయితే ఈ సినిమా కథ, కథనాలు ఆ టైటిల్ కు జస్టిఫై చేస్తాయని అంటున్నారు. అదే జరిగితే మాత్రం ఆనంద్ ఖాతాలో మరో హిట్ పడినట్టే. ఆనంద్ దేవరకొండ చేస్తున్న పుష్పక విమానం సినిమాను విజయ్ దేవరకొండ నిర్మిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *