వకీల్ సాబ్ కు అలియా భట్ ప్రమోషన్.. ఎలాగెలాగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ బెస్ట్ విషెస్ తెలిపింది. వకీల్ సాబ్ (Vakeel Saab) కు అలియా భట్ కు అసలు ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే తెలుగులో ఆర్.ఆర్.ఆర్ మూవీ చేస్తున్న అలియా భట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు వకీల్ సాబ్ పై స్పెషల్ వీడియో చేసింది. అలియా నోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట వినగానే పీ.కే ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవకుండానే తెలుగు ప్రేక్షకులను బుట్టలో వేసుకుంటుంది అమ్మడు.

Vakeel Saab సినిమా బాలీవుడ్ పింక్ రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితే వకీల్ సాబ్ హడావిడి మొదలైంది. ఉదయం ఆట చూసేందుకే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *