సుకుమార్ కు చుక్కలు చూపిస్తున్న అల్లు అర్జున్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ ముగ్గురు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా తీసుకున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఆగష్టు 13న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా విషయంలో డైరక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ ల మధ్య కొద్దిగా డిస్టబెన్సెస్ వచ్చాయట. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు కాని సినిమా షూటింగ్ మాత్రం చాలా స్లోగా చేస్తున్నారట.

బన్నీ మాత్రం ఎలాగైనా సరే అనుకున్న డేట్ కు సినిమా వచ్చేయాలని సుకుమార్ మీద ప్రెజర్ చేస్తున్నాడట. లెక్కల మాష్టారు మాత్రం లెక్క సరిగా రావాల్సిందే అని.. లేట్ చేస్తున్నారట. సో తొందరపడాలంటున్న హీరోకి.. మంచి అవుట్ పుట్ రావాలంటే స్లోగా చేయాలంటున్న డైరక్టర్ కి మధ్య సఖ్యత లోపించిందని టాక్. సుకుమార్ తో ఆర్య, ఆర్య 2తో తన టాలెంట్ చూపించాడు బన్నీ. అలాంటిది ఈ ఇద్దరు కలిసి చేస్తున్న మూడవ సినిమా విషయంలో వీరి మధ్య దూరం పెరగడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. రిలీజ్ డేట్ మారినంత మాత్రానా పోయేది ఏమి లేదు కాని కోట్లు పెట్టి తీసిన సినిమా అంచనాలను అందుకోకపోతే మాత్రం ఆ ఎఫెక్ట్ వేరేలా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *