వయసులో చిన్నోడితో అనుష్క పెళ్లి.. ఫ్యాన్స్ హర్ట్.. వైరల్ అవుతున్న న్యూస్..!

స్వీటీ అనుష్క పెళ్లికి సిద్ధమైంది.. ఇది పాత వార్తే.. మీడియా వాళ్లు అనుష్క (Anushka)కి ప్రభాస్ కి చాలా సార్లు పెళ్లి చేశారు. మేమిద్దరం మంచి స్నేహితులం అని ఎంత చెప్పినా సరే ఎబ్బే మేం రాసేది రాసుకుంటాం అని ఇష్టం వచ్చినట్టుగా రాసేశారు.

అయితే మీరు ఎన్ని రాసుకున్నా మాకు అనవసరం అని పట్టించుకోవడం మానేశారు ప్రభాస్, అనుష్క. అయితే అనుష్క ఓ బిజినెస్ మెన్ తో పెళ్లికి రెడీ అవుతుందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్త.

Anushka

లేటెస్ట్ గా Anushka దుబాయ్ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అనుష్కని పెళ్లి చేసుకునే ఆ వ్యక్తి అనుష్క కన్నా వయసులో చిన్న వాడట. అనుష్క వయసులో చిన్న వాడిని పెళ్లి చేసుకుంటుందని ఒకటే హడావిడి. స్వీటీ పెళ్లి గురించి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కన్నా మీడియా వాళ్లకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది.

అందుకే అక్కడ జరిగేది ఉన్నా లేకున్నా నెలకోసారి అనుష్క పెళ్లి అతనితోనే అంటూ వార్తలు రాస్తుంటారు. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టాలంటే మాత్రం అనుష్క స్పందించాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *