బాలయ్య ‘అఖండ’ శాటిలైట్ రైట్స్ రికార్డ్..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న అఖండ టీజర్ తోనే సంచలనం సృష్టించారు. బాలకృష్ణ కెరియర్ లో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన ఈ టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ డిమాండ్ పలికినట్టు తెలుస్తుంది. అఖండ శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా దక్కించుకుందని తెలుస్తుంది. స్టార్ మా Balakrishna అఖండ రైట్స్ ను 16 కోట్లకు కొనేసిందని టాక్.

బాలయ్య బాబు కెరియర్ లో శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ కు అమ్ముడవడం ఇదే మొదటిసారి. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ (Balakrishna) డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *