Thursday, June 24

బాలకృష్ణతో క్రాక్ 2.. జయమ్మ కూడా..!

నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాస్ మహరాజ్ రవితేజతో క్రాక్ అంటూ సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య బాబుకి కూడా అలాంటి ఓ మాస్ మసాల కథ రెడీ చేసినట్టు తెలుస్తుంది.

క్రాక్ బ్యాక్ డ్రాప్ గా వాడుకున్న వేటపాలెం (Jayamma) నేపథ్యంతోనే బాలకృష్ణ సినిమా కూడా చేస్తున్నారట.

అంతేకాదు క్రాక్ లో అలరించిన జయమ్మ పాత్రని ఈ సినిమాలో కూడా పెడుతున్నాడట గోపీచంద్. Jayammaగా వరలక్ష్మి శరత్ కుమార్ అదరగొట్టేశారు.

బాలయ్య మూవీలో కూడా వరలక్ష్మిని సెలెక్ట్ చేశారట గోపీచంద్.

వేటపాలెం కథ..వరలక్ష్మి రిపీట్ చేస్తున్న విధానం చూస్తుంటే రవితేజ క్రాక్ ను కొనసాగింపుగా బాలకృష్ణతో క్రాక్ 2 తీస్తున్నాడా గోపీచంద్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఏది ఏమైనా ఈ కాంబో మాత్రం రచ్చ చేయడం కన్ఫాం అని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *