Thursday, June 24

Telugu Movie News

మంచు హీరో సినిమాలో మెగా మేనల్లుడు..?
Telugu Movie News

మంచు హీరో సినిమాలో మెగా మేనల్లుడు..?

మంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ రాకింగ్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నా ఆ తర్వాత కెరియర్ లో ఆయన చేసిన సినిమాల ప్రభావంతో వెనకపడ్డాడు. పెళ్లి.. డైవర్స్.. ఫ్యామిలీ డిస్టబెన్స్ ల వల్ల మంచు మనోజ్ సినిమాల మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఫైనల్ గా కొద్దిపాటి గ్యాప్ తర్వాత అహ బ్రహ్మస్మి సినిమాతో రాబోతున్నాడు మంచు హీరో. శ్రీకాంత్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటుగా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో స్పెషల్ కెమియో రోల్ గా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటిస్తున్నాడని టాక్. మనోజ్, సాయి ధరం తేజ్ ఇద్దరు మంచి స్నేహితులు.. అందుకే మనోజ్ సినిమా కోసం తేజ్ తన వంతు సహకారం అందిస్తున్నట్టు తెలుస్తుంది. మెగా మేనల్లుడిగా తన వరుస సినిమాలతో మెగా ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్నాడు సాయి ధరం తేజ్. ఈమధ్యనే అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెనతో ఓ రేంజ్ హిట్ అందుకున్నాడు. ...
ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాలో ఆమె ఫిక్స్..?
Telugu Movie News

ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాలో ఆమె ఫిక్స్..?

ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న సినిమా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ముందు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ తో ఈ కాంబో సినిమా వస్తుందని అనుకోగా.. ఇప్పుడు కథ పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్నని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక వరుస సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. లాస్ట్ ఇయర్ సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో హిట్ అందుకున్న అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది. తారక్, త్రివిక్రం కాంబో సినిమాలో రష్మిక లక్కీ ఛాన్స్ కొట్టేసిందని చెప్పొచ్చు. తెలుగులో పూజా హెగ్దే, రష్మిక ఈ ఇద్దరు ప్రస్తుత...
పవన్ గొంతెత్తితే.. రీమేక్ లో పవన్ సింగేస్తున్నాడహో..!
Telugu Movie News

పవన్ గొంతెత్తితే.. రీమేక్ లో పవన్ సింగేస్తున్నాడహో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం హీరోగానే కాదు సినిమాలో తనకు తోచిన విభాగంలో పనిచేస్తుంటారు. కథా చర్చల్లో తన ఇమేజ్ కు తగినట్టుగా మార్పులు చేర్పులు సూచించే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కథ ఆయనే సిద్ధం చేయడం విశేషం. అంతేకాదు అంతకుముందు జానీ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు కూడా.. ఇదిలాఉంటే ఆయన సినిమాలో ప్రత్యేకంగా పవన్ పాడటం అనేది ఓ సరదా. ఆయన పాటలు కూడా ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేస్తాయి. అత్తారింటికి దారేది, పంజా, అజ్ఞాతవాసి ఇలా హీరోగానే కాదు సరదాగా ఓ పాట పాడటం పవన్ కు హాబీగా మారింది. ఇక లేటెస్ట్ గా మరోసారి పవన్ గొంతు సవరించుకుంటున్నాడు. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ డైరక్షన్ లో చేస్తున్న హరి హర వీరమల్లు సినిమాతో పాటుగా చేస్తున్న మళయాళ మూవీ రీమేక్ లో పవన్ ఓ సాంగ్ సింగేస్తున్నాడని తెలుస్తుంది. పవన్ పాడితే ఆ ఊపు.. ఉత్సాహం వేరే లెవల్ లో ఉంటుంది. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్...
అమేజాన్ ప్రైమ్ లో జాతిరత్నాలు ఎప్పటి నుండో తెలుసా..?
Telugu Movie News

అమేజాన్ ప్రైమ్ లో జాతిరత్నాలు ఎప్పటి నుండో తెలుసా..?

ఓ ముగ్గురు అల్లరి చిల్లర కురాళ్లు.. ఏదో సాధిద్దామని హైదరబాద్ వస్తారు.. వారి గ్యాంగ్ లోకి ఓ అమ్మాయి చేరుతుంది. అనుకోకుండా ఓ స్కాం లో ఇరుకున్న వారు దాని నుండి ఎలా బయటపడ్డారు. ఈ ముగ్గురు అమాయక కుర్రాళ్ల పరిస్థితి ఏమైంది అన్న కథాంశంతో వచ్చిన సినిమానే జాతిరత్నాలు. సినిమాలో కథ సీరియస్ గా కాకుండా చాలా తేలికగా తీసుకుని కేవలం ఆడియెన్స్ ను నవ్వించడమే తమ ముఖ్య ఉద్దేశ్యం అని పెట్టుకుని సినిమా చేశాడు అనుదీప్ కెవి. నాగ్ అశ్విన్ నిర్మాణంలో నవీన్ పొలిశెట్టి, ఫరియా జంటగా.. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇంపార్టెంట్ రోల్స్ లో నటించిన సినిమా జాతిరత్నాలు. మార్చ్ 11న శివరాత్రి సందర్భంగా రిలీజైన ఈ సినిమా వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది. సినిమా రిలీజైన వీకెండ్ లోనే లాభాలు రాగా.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో కూడా నిర్మాతలకు మంచి బెనిఫిట్స్ తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తారన...
Viral News, Telugu Movie News

జాతిరత్నాలు మేకింగ్ వీడియో.. వీళ్లు సినిమాను ఇంత జాలీగా తీశారేంటి..?

సినిమా హిట్ అవడానికి కోట్ల కొద్దీ బడ్జెట్టు.. ఫారిన్ లొకేషన్లు.. భారీ యాక్షన్ సీన్లు.. ఒళ్లు గుళ్ల చేసుకోవడం లాంటివి చేయకుండా.. రెండున్నర గంటలు ఆడియెన్స్ ను నవ్వించినా చాలు హిట్ చేసేస్తారు అని ప్రూవ్ చేసిన సినిమా జాతిరత్నాలు. ఆ సినిమా చూసి అయ్యబాబోయ్ ఇది సినిమానా కాదు లాఫ్టర్ థెరపీ అని కొందరు అంటే.. సినిమాలో కథ ఏముంది.. మొత్తం కామెడీనే.. దీని బదులు జబర్దస్త్ చూడొచ్చు అనుకున్న వారు లేకపోలేదు. అయితే సెకండ్ కేటగిరి ఆడియెన్స్ చాలా తక్కువ అనుకోండి. ఓవరాల్ గా జాతిరత్నాలు యూనిట్ ఏదైతే ఊహించి రిలీజ్ చేశారో.. దాన్ని ఆడియెన్స్ కూడా అదే విధంగా రిసీవ్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ ముందు చేసిన ప్రమోషన్స్.. రిలీజ్ తర్వాత చేస్తున్న హడావిడి కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాను ఇలా కూడా తీస్తారా అనిపించేలా జాతిరత్నాలు మేకింగ్ వీడి...
Telugu Movie News

అతడు.. ఖలేజా.. ఈసారి ఏం తీస్తారో..?

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్.. సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే.. అబ్బో ఇంకేమైనా ఉందా రికార్డులు క్రియేట్ చేయరు.. అతడుతో అదరగొట్టి ఖలేజాతో టార్గెట్ మిస్సైనా బుల్లితెర మీద.. ప్రతి ప్రేక్షకుడి హృదయాల్లో నువ్వు దేవుడు సామి అనిపించుకున్న త్రివిక్రం.. మహేష్ కాంబో మరోసారి రిపీట్ అవబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా పూర్తి చేసే పనిలో మహేష్.. తారక్ తో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లేలా త్రివిక్రం ఎవరి సినిమాల బిజీలో వారున్నారు. అయితే వారు కమిటైన సినిమాలు పూర్తి కాగానే వీరిద్దరు కలిసి సినిమా చేస్తారని తెలుస్తుంది. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ తన నెక్స్ట్ సినిమా అసలైతే రాజమౌళితో అనుకున్నాడు. అయితే జక్కన్నతో సినిమా అంటే రెండు మూడేళ్లు రాసిచ్చేయాల్సిందే. అందుకే మహేష్ రాజమౌళి సినిమాకు ముందు మరో సినిమా అనుకుంటున్నాడు. అది త్రివిక్రం డైరక్షన్ లోనే...
Telugu Movie News

నాని జెర్సీ.. మహేష్ మహర్షి.. నేషనల్ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు..!

67వ నేషనల్ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2019వ సంవత్సరానికి గాను సంబందించిన సినిమాల్లో అన్ని విభాగాల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలకు అవార్డులను ప్రకటించింది. బెస్ట్ యాక్టర్ గా ఈసారి ఇద్దరు నటులు అవార్డ్ షేర్ చేసుకుంటున్నారు. అందులో ఒకరు తమిళ హీరో ధనుష్.. రెండవ నటుడు మనోజ్ బాజ్ పాయ్. ధనుష్ అసురన్ సినిమాలో నటనకు గాను అవార్డ్ అందుకోగా.. భోంస్లే సినిమాలో మనోజ్ నటనకు నేషనల్ అవార్డ్ దక్కింది. ఇక తెలుగు సినిమాలు నాని జెర్సీ.. మహేష్ మహర్షి సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి. నాని జెర్సీ సినిమాకు ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డ్ రాగా.. ఎడిటింగ్ విభాగంలో బెస్ట్ ఎడిటర్ గా నవీన్ నూలిని అవార్డ్ వచ్చింది. ఇక మహర్షి సినిమాకు బెస్ట్ ఎంటర్టైనర్ మూవీగా అవార్డ్ రాగా.. బెస్ట్ ప్రొడక్షన్ హౌజ్.. బెస్ట్ కొరియోగ్రాఫర్ కేటగిరిల్లో సెలెక్ట్ అయ్యారు. మొత్తానికి తెలుగు సినిమాలకు నేషనల్ అవార్...
Telugu Movie News

చరణ్ బర్త్ డే.. RRR నుండి అదిరిపోయే గిఫ్ట్..!

బాహుబలి తర్వాత ఎలాంటి గ్రాఫిక్స్ లేని ఓ చిన్న సినిమా తీస్తానని చెప్పిన రాజమౌళి బాహుబలిని మించేలా ఆర్.ఆర్.ఆర్ షురూ చేశాడు. ఒక హీరోతోనే అద్భుతాలు సృష్టించగల ఆయన ఈసారి ట్రిపుల్ ఆర్ కోసం ఇద్దరు సూపర్ హీరోస్ ను సెలెక్ట్ చేశాడు. అంతేకాదు ఇద్దరు రియల్ లైఫ్ హీరోల కథతో కల్పిత కథతో ఆర్.ఆర్.ఆర్ సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి సంచలనాలు మొదలయ్యాయి. తారాస్థాయిలో అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో తారక్. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాం చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన భీం, రామరాజు టీజర్లు సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేశాయి. ఇక లేటెస్ట్ గా మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా మరో స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఆల్రెడీ రామరాజు టీజర్ లో చరణ్ లుక్ చూపించిన జక్కన్న ఈసారి ఆయన డైలాగ్ టీజర్ ను వదులుతారని తెలుస్తుంది. సినిమాలో చర...
Telugu Movie News

రానాని తక్కువ అంచనా వేశా.. వెంకటేష్ ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు..!

మూవీ మొఘల్ రామానాయుడు ఫ్యామిలీ నుండి వచ్చిన యువ హీరో దగ్గుబాటి రానా. నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు రానా. హీరోగానే కాదు విలన్ గా కూడా తన నట విశ్వరూపం చూపించాడు. లేటెస్ట్ గా రానా చేసిన మరో ప్రయోగాత్మక సినిమా అరణ్య. ప్రభు సోలమన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అడవిలో ఉన్న ఏనుగులకు ఆపద కలిగించి.. వాటి ఆశ్రయమైన అడవిని కాజేయాలనుకునే విలన్ల పని పట్టే ఓ అడవి మనిషి కథే అరణ్య మూవీ కథాంశం. సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించాయి. తప్పకుండా సినిమా రానా కెరియర్ లో బెస్ట్ మూవీగా నిలిచేలా ఉంది. ఈ సినిమా చూసిన వెంకటేష్ రానాని ఆకాశానికెత్తెశాడు. ఏమో అనుకున్నాను కాని రానా చాలా బాగా నటించాడు. సినిమా అద్భుతంగా ఉంది. ఇది నేచర్ సినిమా అని వెంకటేష్ మొదటిసారి రానా గురిచి చాలా పాజిటివ్ గా ఎంకరేజింగ్ గా మాట్లాడారు. న...
Movie news, Telugu Movie News

ఖమ్మం ‘జాతిరత్నాలు’.. కుర్రాళ్లు అదరగొట్టారు..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు.. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు.. అని ఆర్జీవి డైరక్షన్ లో వచ్చిన అప్పల్రాజు సినిమాలో పాట లానే టాలెంట్ ఉంటే అవకాశాలు ఒకరు ఇవ్వడం కాదు తమకు తామే సృష్టించుకుంటాం అనేలా ఉన్నారు నేటి యువకులు. సినిమాల్లో నటించాలని.. టాలెంట్ చూపించాలని ఉన్నా సరైన వేదిక దొరకడం కష్టం. అందుకే తమకు తాముగా ఓ వేదిక ఏర్పరచుకుని తమకు వచ్చిన టాలెంట్ ను చూపించేస్తున్నారు ఖమ్మం కుర్రాళ్లు. రామ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఖమ్మం లో కొన్నాళ్లుగా షార్ట్ ఫిలంస్, కవర్ సాంగ్స్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా థియేటర్లలో సందడి చేస్తున్న జాతిరత్నాలు సినిమాలోని టైటిల్ సాంగ్ ను కవర్ చేశారు ఖమ్మం జాతిరత్నాలు. సినిమాలో సాంగ్ కు ఏమాత్రం తగ్గకుండా ఖమ్మం లోకల్ టాలెంటెడ్ పీపుల్ ఇలా రెచ్చిపోయారు. షఫి డైరక్షన్ చేస్తూ.. ప్రవీన్ డిఓపీగా పనిచేస్తూ ఈ కవర్ సాంగ్ లో నటించారు. వీరితో పాటుగా ఆసిఫ్, రవి కుమార్ లు కూడా కవర్...