Tuesday, January 18

Telugu Movie News

Telugu Movie News

చరణ్ బర్త్ డే.. RRR నుండి అదిరిపోయే గిఫ్ట్..!

బాహుబలి తర్వాత ఎలాంటి గ్రాఫిక్స్ లేని ఓ చిన్న సినిమా తీస్తానని చెప్పిన రాజమౌళి బాహుబలిని మించేలా ఆర్.ఆర్.ఆర్ షురూ చేశాడు. ఒక హీరోతోనే అద్భుతాలు సృష్టించగల ఆయన ఈసారి ట్రిపుల్ ఆర్ కోసం ఇద్దరు సూపర్ హీరోస్ ను సెలెక్ట్ చేశాడు. అంతేకాదు ఇద్దరు రియల్ లైఫ్ హీరోల కథతో కల్పిత కథతో ఆర్.ఆర్.ఆర్ సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి సంచలనాలు మొదలయ్యాయి. తారాస్థాయిలో అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో తారక్. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాం చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన భీం, రామరాజు టీజర్లు సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేశాయి. ఇక లేటెస్ట్ గా మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా మరో స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఆల్రెడీ రామరాజు టీజర్ లో చరణ్ లుక్ చూపించిన జక్కన్న ఈసారి ఆయన డైలాగ్ టీజర్ ను వదులుతారని తెలుస్తుంది. సినిమాలో చర...
Telugu Movie News

రానాని తక్కువ అంచనా వేశా.. వెంకటేష్ ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు..!

మూవీ మొఘల్ రామానాయుడు ఫ్యామిలీ నుండి వచ్చిన యువ హీరో దగ్గుబాటి రానా. నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు రానా. హీరోగానే కాదు విలన్ గా కూడా తన నట విశ్వరూపం చూపించాడు. లేటెస్ట్ గా రానా చేసిన మరో ప్రయోగాత్మక సినిమా అరణ్య. ప్రభు సోలమన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అడవిలో ఉన్న ఏనుగులకు ఆపద కలిగించి.. వాటి ఆశ్రయమైన అడవిని కాజేయాలనుకునే విలన్ల పని పట్టే ఓ అడవి మనిషి కథే అరణ్య మూవీ కథాంశం. సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించాయి. తప్పకుండా సినిమా రానా కెరియర్ లో బెస్ట్ మూవీగా నిలిచేలా ఉంది. ఈ సినిమా చూసిన వెంకటేష్ రానాని ఆకాశానికెత్తెశాడు. ఏమో అనుకున్నాను కాని రానా చాలా బాగా నటించాడు. సినిమా అద్భుతంగా ఉంది. ఇది నేచర్ సినిమా అని వెంకటేష్ మొదటిసారి రానా గురిచి చాలా పాజిటివ్ గా ఎంకరేజింగ్ గా మాట్లాడారు. న...
Movie news, Telugu Movie News

ఖమ్మం ‘జాతిరత్నాలు’.. కుర్రాళ్లు అదరగొట్టారు..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు.. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు.. అని ఆర్జీవి డైరక్షన్ లో వచ్చిన అప్పల్రాజు సినిమాలో పాట లానే టాలెంట్ ఉంటే అవకాశాలు ఒకరు ఇవ్వడం కాదు తమకు తామే సృష్టించుకుంటాం అనేలా ఉన్నారు నేటి యువకులు. సినిమాల్లో నటించాలని.. టాలెంట్ చూపించాలని ఉన్నా సరైన వేదిక దొరకడం కష్టం. అందుకే తమకు తాముగా ఓ వేదిక ఏర్పరచుకుని తమకు వచ్చిన టాలెంట్ ను చూపించేస్తున్నారు ఖమ్మం కుర్రాళ్లు. రామ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఖమ్మం లో కొన్నాళ్లుగా షార్ట్ ఫిలంస్, కవర్ సాంగ్స్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా థియేటర్లలో సందడి చేస్తున్న జాతిరత్నాలు సినిమాలోని టైటిల్ సాంగ్ ను కవర్ చేశారు ఖమ్మం జాతిరత్నాలు. సినిమాలో సాంగ్ కు ఏమాత్రం తగ్గకుండా ఖమ్మం లోకల్ టాలెంటెడ్ పీపుల్ ఇలా రెచ్చిపోయారు. షఫి డైరక్షన్ చేస్తూ.. ప్రవీన్ డిఓపీగా పనిచేస్తూ ఈ కవర్ సాంగ్ లో నటించారు. వీరితో పాటుగా ఆసిఫ్, రవి కుమార్ లు కూడా కవర్...