Tuesday, December 7

వకీల్ సాబ్ మెచ్చిన కలక్షన్ కింగ్..!

కలక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ (Vakeel Saab pawankalyan) సినిమా చూసి మెచ్చుకున్నారని తెలుస్తుంది.

మాములుగా బాగా నచ్చితే కాని సినిమా బాగుందని చెప్పని మోహన్ బాబు పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాను అమేజాన్ ప్రైం లో చూసి సినిమా సూపర్ అనేశారట.

అంతేకాదు ఒకరిద్దరి దగ్గర వకీల్ సాబ్ సినిమా ప్రస్థావన కూడా తెచ్చి ప్రశమించారని తెలుస్తుంది.

బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో వేణు శ్రీరాం డైరెక్ట్ చేశారు.

పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా మూల కథ దెబ్బతినకుండా Vakeel Saab pawankalyan సినిమా కథనం రాసుకున్నారు.

ఫలితంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది.

వకీల్ సాబ్ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీస్ సినిమాను ప్రశంసించగా ఆ లిస్ట్ లో ఇప్పుడు కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *