దిల్ రాజు మేనల్లుడు కదా ఆ మాత్రం ఉండాల్సిందే.. రౌడీ బాయ్స్ మోషన్ పోస్టర్..!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నాడు. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ హీరోగా రౌడీ బాయ్స్ (Rowdy Boys) అనే సినిమా వస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. హుషారు సినిమాను డైరెక్ట్ చేసిన హర్ష కొనుగంటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మోషన్ పోస్టర్ తోనే సినిమాపై క్రేజ్ తెచ్చారని చెప్పొచ్చు. హీరోని రివీల్ చేయకుండా టైటిల్ పోస్టర్ కోసం దేవి అందించిన మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. దిల్ రాజు మేనల్లుడు అంటే ఆ మాత్రం ఉండకపోతే ఎలా అని అంటున్నారు కొందరు. ఏది ఏమైనా Rowdy Boys అంటూ వస్తున్న ఆశిష్ కు మంచి క్రేజ్ వచ్చేలా ఉందని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *