Monday, October 18

జోగిపేట శ్రీకాంత్ అలా ఫ్రెండ్ మీద అభిమానం చూపించిన డైరక్టర్ అనుదీప్..!

జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యువ దర్శకుడు అనుదీప్ కెవి (Jathiratnalu). ఈ సినిమాతో అతను టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు. కామెడీ జానర్ లో ఈ రేంజ్ హిట్ అందుకున్న ఈ డైరక్టర్ కు నిర్మాతల నుండి మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. మిస్డ్ కాల్ షార్ట్ ఫిల్మ్ ద్వారా నాగ్ అశ్విన్ తో ఏర్పడ్డ పరిచయం జాతిరత్నాలు సినిమా తీసేలా చేసింది. అయితే అనుదీప్ మొదటి సినిమా పిట్టగోడ పెద్దగా ఆడలేదు. అయినా సరే నాగ్ అశ్విన్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు.

ఇక ఇదిలాఉంటే బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేసిన అనుదీప్ సినిమాల మీద ఇష్టంతో సంగారెడ్డి నుండి హైదరాబాద్ వచ్చాడట. (Jathiratnalu) లగేజ్ ఓ రూం లో.. తానొక రూం లో ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగాడట. ఆ టైం లో తన స్నేహితుడు శ్రీకాంత్ జాబ్ చేస్తూ తనకు అవసరమైన డబ్బు ఇచ్చాడట. అందుకే అతనికి కృతజ్ఞతగా జాతిరత్నాలు సినిమాలో హీరో పేరుని జోగిపేట శ్రీకాంత్ అని పెట్టాడు అనుదీప్. మొత్తానికి సహాయం చేసిన ఫ్రెండ్ ను మర్చిపోకుండా తన సినిమాలో హీరో పాత్ర పేరు పెట్టి నిజమైన జాతిరత్నం అనిపించుకున్నాడు అనుదీప్ కెవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *