Tuesday, January 18

కార్తీ ‘సుల్తాన్’ ట్రైలర్.. 100 తలల రావణుడు అదరగొట్టేశాడుగా..!

కోలీవుడ్ హీరో కార్తీ హీరోగా బక్కియరాజ్ కన్నన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సుల్తాన్. ఏప్రిల్ 2న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. సినిమాలో కార్తీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. (Karth) వందమంది రౌడీ మూకలే తన అన్నయ్యలుగా చెప్పుకునే హీరో ఓ అమ్మాయి కోసం తనతో పాటుగా ఓ ఊరిని ఇబ్బందుల్లో పడేస్తాడు. మరి ఆ టైం లో ఈ హీరో తన విలన్ గ్యాంగ్ తో ఏం చేశాడు అన్నది సుల్తాన్ కథ.

సినిమా కథ ఎలా ఉన్నా ట్రైలర్ చూడగానే సూపర్ అనిపించేలా యాక్షన్, ఎమోషన్, లవ్, కామెడీ సీన్స్ ఉన్నాయి. చూస్తుంటే (Karth) కార్తీకి ఈ సినిమా మరో హిట్ తన ఖాతాలో పడేలా ఉంది. కార్తీ ఖైదీ మార్క్ మాస్ ఇమేజ్ తో వస్తున్న ఈ సుల్తాన్ కూడా అదే తరహా రిజల్ట్ అందిస్తుందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఈ సినిమాకు వివేక్ మెర్విన్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఏప్రిల్ 2న నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా కూడా వస్తుంది. ఆ సినిమాకు కార్తీ సుల్తాన్ గట్టి పోటీ ఇచ్చేలా ఉందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *