Thursday, June 24

నిన్ను అందరు అమాయకుడని అనుకుంటున్నారు.. రంగ్ దే దర్శకుడిపై కీర్తి సురేష్ హాట్ కామెంట్స్..!

నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే సినిమా ఈ శుక్రంవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో రంగ్ దే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ అటెండ్ అయ్యారు.

ఇక ఈ ఈవెంట్ లో భాగంగా కీర్తి సురేష్ డైరక్టర్ వెంకీ అట్లూరి మీద హాట్ కామెంట్స్ చేసింది. అందరు నిన్ను అమాయకుడు అని అనుకుంటున్నారు. కాని నీ అసలు రంగు గురించి నేను చెబుతా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే తర్వాత మళ్లీ సరదాగా నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాను.. వెంకీ చాలా మంచి పర్సన్.. కథ చెప్పగానే చాలా బాగా నచ్చి సినిమాకు ఓకే చెప్పానని అన్నది కీర్తి సురేష్. మహానటి తర్వాత తెలుగులో మంచి హిట్ కోసం చూస్తున్న కీర్తి సురేష్ కు రంగ్ దే ఆ హిట్ ఇచ్చేలా ఉందని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *