అతడు.. ఖలేజా.. హ్యాట్రిక్ ఎనౌన్స్ మెంట్.. ఈసారి ఏం తీస్తారో..!

సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది. అతడు.. ఖలేజా.. ఈ రెండు సినిమాలు వారి కాంబినేషన్ లో వచ్చాయి. ఈ రెండు సినిమాలు మహేష్ (Mahesh) కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాలుగా నిలిచాయి.

కేవలం మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులను ఈ రెండు సినిమాలు అలరించాయి. ఇక మరోసారి ఈ కాంబో ఫిక్స్ అయ్యింది. హ్యాట్రిక్ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ లో చేస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత 11 ఏళ్ల గ్యాప్ తో త్రివిక్రం, మహేష్ కలిసి చేస్తున్నారు.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో Mahesh రా ఏజెంట్ గా కనిపిస్తారని తెలుస్తుంది. మహేష్ తో త్రివిక్రం ఈ కాంబో ఎప్పటికి స్పెషల్ గా ఉంటుంది. మరి ఈ హ్యాట్రిక్ కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుండగా 2022 ఏప్రిల్ లో రిలీజ్ ఫిక్స్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *