Monday, October 18

7 డేస్.. 6 నైట్స్.. ఎమ్మెస్ రాజు మరో బూతు సినిమా..!

ఒకప్పుడు నిర్మాతగా స్టార్ హీరోలతో సూపర్ సినిమాలను అందించిన ఎమ్మెస్ రాజు (MS Raju)నిర్మాతగా సినిమాలు ఆపేసి డైరక్టర్ గా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈమధ్యనే డర్టీ హరి అని సినిమాతో యువత మెప్పు పొందిన ఎమ్మెస్ రాజు ఈసారి మరో రొమాంటిక్ స్టోరీతో వస్తున్నారు. తన నెక్స్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారు ఎమ్మెస్ రాజు. 7 డేస్ 6 నైట్స్ టైటిల్ తో ఎమ్మెస్ రాజు సినిమా వస్తుంది.

ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబందించిన అప్డేట్ ఇచ్చారు. డర్టీ హరి సినిమాను మించి ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. చూస్తుంటే MS Raju రాజు మరో బూతు సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను జూలై నుండి సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *