నాగ చైతన్య లవ్ స్టోరీ వాయిదా..?

అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఏప్రిల్ 16న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ విషయంలో కన్ ఫ్యూజన్ ఏర్పడింది. కేవలం వారం మాత్రమే రిలీజ్ ఉన్న ఈ సినిమా కు ఎలాంటి ప్రమోషన్స్ ప్రారంభించలేదు. సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన పోస్టర్స్ తో అయితే లవ్ స్టోరీ (Love Story) ఏప్రిల్ 16న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. కాని సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ విషయంలో మాత్రం యాక్టివ్ గా లేరు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం లవ్ స్టోరీ సినిమాను మేకర్స్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే అఫీషియల్ గా మాత్రం ఇంకా ఎనౌన్స్ చేయలేదు. ఏప్రిల్ 16న చైతు సినిమా వస్తుందని నాని టక్ జగదీష్ ను ఏప్రిల్ 23కి వాయిదా వేసుకున్నాడు. మరి రెండు వారాల తర్వాత రాబోతున్న నాని సినిమాకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా నాగ చైతన్య Love Storyకి మాత్రం ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. మరి లవ్ స్టోరీ నిజంగా అనుకున్న టైం కు వస్తుందా రాదా అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *