Thursday, June 24

నాగార్జున ప్లాన్ అదిరింది.. ఆహాకి పోటీగా సరికొత్త ఓటిటి పేరు కూడా ఫిక్స్..!

కింగ్ నాగార్జున మరో సరికొత్త ప్లాన్ తో వస్తున్నారు. సినిమాల్లో హీరోగానే కాకుండా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా కొనసాగుతున్న నాగ్ (Nagarjuna) సినిమాలతో పాటుగా సీరియల్స్ కూడా తీస్తూ అలరిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు డిజిటల్ యుగంలో డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద ఓటిటి లకు ఎక్కువ స్కోప్ దొరికింది. అందుకే నాగార్జున కూడా సరికొత్త ఓటిటి ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ తెలుగులో ఆహా ఓటిటి సూపర్ సక్సెస్ అయ్యింది.

ఆహాని చూసి నాగార్జున కూడా సొంత ఓటిటి ప్లాన్ చేస్తున్నారట. ఈ ఓటిటికి మనం అని పేరు కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. Nagarjuna ఏం ప్లాన్ చేసినా అది అదిరిపోతుంది. ఆహాకి పోటీగా అని కాకుండా టాలీవుడ్ లో మరో తెలుగు ఓటిటికి స్కోప్ ఉందని గుర్తించిన నాగ్ మనం ఓటిటిని ఏర్పాటు చేస్తున్నారట. ప్రస్తుతం దానికి సంబందిచిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. నాగార్జున ఏం చేసిన అది వర్క్ అవుట్ అవకుండా ఉండదు. మరి ఈ ఓటిటి ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాలి. సొంత ఓటిటిలో వెబ్ సీరీస్, ఇండిపెండెంట్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారట నాగ్.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *