అమేజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్.. వచ్చేస్తుందహో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ (Vakeel Saab) సినిమా థియేటర్లో సందడి దాదాపు ముగిసినట్టే. కరోనా తీవ్రత మళ్లీ పెరగడంతో తెలుగు రెండు రాష్ట్రాల్లో థియేటర్లు స్వచ్చంధంగా మూసేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయగా త్వరలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద హంగామా చేసేందుకు రెడీ అవుతుంది. వకీల్ సాబ్ సినిమాను అమేజాన్ ప్రైమ్ కొనేసింది.

ఈ సినిమాను వచ్చే నెలలో ప్రైమ్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా 28 రోజుల తర్వాత అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. ఈ క్రమంలో త్వరలో ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ లో వస్తుందని తెలుస్తుంది. ఎలాగు థియేటర్లు బంద్ అవడంతో Vakeel Saab కు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద కూడా భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వచ్చిన వకీకలిసిల్ సాబ్ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేశారు. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *