పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ బెనిఫిట్ షో టికెట్ రేట్ ఎంతో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. రీసెంట్ గా మ్యూజిక్ ఈవెంట్ ఒకటి కాకినాడలో జరుపగా సోమవారం ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ (Vakeel Saab) సినిమాను ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సినిమాకు మునుపెన్నడూ లేని విధంగా బెనిఫిట్ షోస్ ప్లాన్ చేస్తున్నారట. అర్ధరాత్రి 12 గంటల నుండే బెనిఫిట్ షోస్ ప్లాన్ చేయాలని చూస్తున్నారు.

అన్ని ఏరియాల్లో ఈ బెనిఫిట్ షోస్ వేసేలా ప్లాన్ చేశారట. ఈ బెనిఫిట్ షో టికెట్ 1500 దాకా ఉంటుందని టాక్. 100, 200 పెట్టి చూసేట్టు అయితే 10, 15 షోలు చూసే మొత్తంతో ఒక షో చూడాలన్నమాట. ఎర్లీ మోర్నింగ్ బెనిఫిట్ షో టికెట్ 500 గా నిర్ణయించారట. అంతేకాదు వారం పాటు టికెట్ ప్రైజ్ 200 ఉండేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి Vakeel Saab తో మెగా, పవర్ ఫ్యాన్స్ కు జేబులకు చిల్లులు పడటం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *