Tuesday, December 7

పవర్ స్టార్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేస్తుందహో..!

pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్ (pawan). బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రలుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఈ నెల చివర్లో రిలీజ్ అవుతుందని అన్నారు. అయితే ఫైనల్ గా వకీల్ సాబ్ ట్రైలర్ డేట్ ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్.

మార్చ్ 29న వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ ఎనౌన్స్ చేశారు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచిన పవర్ స్టార్ pawan వకీల్ సాబ్ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా చేస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేశారు దర్శక నిర్మాలు. వకీల్ సాబ్ సినిమాతో పాటుగా క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమాతో పాటుగా సాగర్ చంద్ర డైరక్షన్ లో మళయాళ మూవీ రీమేక్ మూవీలో కూడా నటిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *