Thursday, June 24

కోలీవుడ్ కు బుట్టబొమ్మ.. స్టార్ హీరోతో రొమాన్స్..!

తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న పూజా హెగ్దే ఇక్కడ వరుస హిట్లు కొడుతూ తమిళ మేకర్స్ దృష్టిలో పడ్డది. ఆల్రెడీ అమ్మడి తెరంగేట్రం తమిళ సినిమాతోనే అయ్యింది. జీవ హీరోగా వచ్చిన మూగముడి సినిమాలో హీరోయిన్ గా నటించింది Pooja Hegde ఆ సినిమా తర్వాతే తెలుగులో ఆమెకు అవకాశాలు వచ్చయి. ఒక లైలా కోసం, ముకుంద సినిమాలు చేసిన పూజా హెగ్దే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథం సినిమా సూపర్ క్రేజ్ తెచ్చింది.

ఆ సినిమాతో అమ్మడు తెలుగులో లైం లైట్ లోకివచ్చింది. ఇక అక్కడ నుండి స్టార్ సినిమాలతో కెరియర్ సూపర్ స్వింగ్ లో ఉంది. ఇక లేటెస్ట్ గా అమ్మడి క్రేజ్ కోలీవుడ్ కు పాకింది. అందుకే అక్కడ నుండి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. కోలీవుడ్ లో విజయ్ హీరోగా వస్తున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. నెల్సన్ డైరక్షన్ లో విజయ్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలో Pooja Hegde కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. మాస్టర్ తర్వాత విజయ్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *