Tuesday, December 7

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ ఎక్కడ ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని అనుకున్నారు కాని అది కుదరలేదు. అయితే సినిమా రిలీజ్ కు మరో ఆరు రోజులే ఉంది కాబట్టి నిర్మాత దిల్ రాజు ఫైనల్ గా వకీల్ సాబ్ (Vakeel Saab) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిక్స్ చేశారు.

శిల్పకళా వేదికలోనే Vakeel Saab ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఏప్రిల్ 4 ఆదివారం సాయంత్రం ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే తక్కువ మందికే ఈ ఈవెంట్ కు ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు మాస్క్ లేని వారికి ఎంట్రీ ఉండదని చెబుతున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు సహకరించి ఈ ఈవెంట్ ను సక్సెస్ చేయాలని నిర్మాత దిల్ రాజు కోరుతున్నారు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శృతి హాసన్, అంజలి, నివేదా థామస్ నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *