వకీల్ సాబ్ ఫస్ట్ డే టార్గెట్ ఎంత..?

Powerstar Pawan Kalyan Vakeel Saab Huge Expectations

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఫస్ట్ డే టార్గెట్ భారీగా ఉందని తెలుస్తుంది. సినిమా బిజినెస్ 90 కోట్ల దాకా చేయగా మొదటి రోజు దాదాపు 30 నుండి 35 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. నైజాం లో 355, సీడెడ్ లో 200, ఆంధ్రాలో 600కు పైగా థియేటర్స్ లో వకీల్ సాబ్ రిలీజ వుతుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో మొత్తం 1200 సెంటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా (Vakeel Saab) మొదటి రోజు 35 కోట్ల దాకా వసూళ్లను తెస్తుందని అంటున్నారు.

అయితే ఈ వసూళ్లు సినిమా టాక్ ను బట్టి కూడా ఉండొచ్చని అంటున్నారు. అయితే ఆల్రెడీ శుక్ర, శని, ఆది వారాల్లో అన్ని సెంటర్స్ హౌజ్ ఫుల్ అంటున్నారు. చూస్తుంటే మొదటి మూడు రోజుల్లో 50 నుండి 60 కోట్ల టార్గెట్ మాత్రం రీచ్ అయ్యేలా ఉంది Vakeel Saab. ఈ లెక్కన పవర్ స్టార్ మరోసారి రికార్డుల మోత మోగించనున్నాడని ఫిక్స్ అవ్వొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *