Tuesday, December 7

వకీల్ సాబ్ కు దెబ్బ కొట్టబోతున్న అంచనాలు..?

పవర్ స్టార్ 3 ఏళ్ల తర్వాత తీసిన సినిమాగా వకీల్ సాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అది కూడా బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ రీమేక్ గా వస్తుందని తెలిసి అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వకీల్ సాబ్ (Vakeel Saab) కథ ట్రైలర్ లో అర్ధమవుతుంది. మూల కథను పవర్ స్టార్ ఇమేజ్ కోసం సోల్ దెబ్బతినకుండా మార్చారు. మరో రెండు రోజులు మాత్రమే రిలీజ్ ఉన్న వకీల్ సాబ్ పై అంచనాలు చూస్తుంటే ఏదో తేదా కొడుతుందని చెప్పొచ్చు.

సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ వకీలు.. ఆయన్ను స్టైల్ గా చూసే అవకాశం లేదు. కేవలం సాంగ్స్ లో మాత్రమే వేరే కాస్టూంస్ లో చూసే అవకాశం ఉంటుంది. అదీగాక సినిమాలో దాదాపు 1 అవర్ వరకు సినిమాలో పవన్ కనిపించకుండా నడుస్తుందట. మరి ఇలాంటివన్ని చూస్తుంటే Vakeel Saab రిజల్ట్ పై మరో ఆలోచన చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా పవర్ స్టార్ ఫ్యాన్స్ వారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బొమ్మ చూసినా దాన్ని హిట్ చేసేస్తారు. మరి వకీల్ సాబ్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *