వకీల్ సాబ్ రివ్యూ & రేటింగ్

Powerstar Pawan Kalyan Vakeel Saab Review Rating

ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ పింక్ రీమేక్ గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం డైరెక్ట్ చేశారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. Vakeel Saab Review Rating

కథ :

లాయర్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) న్యాయం కోసం పోరాడే ప్రతి వ్యక్తికి అండగా ఉంటాడు. ఇలాంటి టైం లోనే ముగ్గురు మహిళలకు జరిగిన అన్యాయం గురించి సత్యదేవ్ కు తెలుస్తుంది. పల్లవి (నివేదా థామస్) ఆమె స్నేహితురాళ్లు సత్య దేవ్ ను కలిసి తమకు న్యాయం జరగాలని కోరుతారు. ఈ టైం లో ఎంపి తనయుడు వారికి చేసిన అన్యాయం గురించి తెలుసుకున్న సత్యదేవ్ వారి తరపున వాధించడానికి కేస్ టేకప్ చేస్తాడు. అవతల పక్క నంద గోపాల్ (ప్రకాశ్ రాజ్) తన క్లైంట్ ను గెలిపించడానికి రకరకాల ఎత్తులు వేస్తాడు. కోర్ట్ రూం లో నంద గోపాల్ వేసిన ప్రశ్నలకే రీ కౌంట్ వేస్తూ సత్యదేవ్ ఆ మహిళలు కేస్ గెలిచేలా చేస్తాడు. ఇదే సినిమా కథ.

విశ్లేషణ :

ఆల్రెడీ సూపర్ హిట్టైన సినిమా కాబట్టి పెద్దగా కష్ట పడకుండా కాపీ పేస్ట్ చేసేయొచ్చు. హిందీలో అమితాబ్ చేసిన పింక్ ను తెలుగులో పవర్ స్టార్ ఇమేజ్ కు నప్పేలా డైరక్టర్ వేణు శ్రీరాం బగా వర్క్ చేశాడు. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తెలుగు నేటివిటీకి దగ్గరగా రాసుకున్నాడు. అయితే ఆ ఎపిసోడ్స్ పెద్దగా ఆశించిన స్థాయిలో ఉండవు. Vakeel Saab Review Rating

ఎప్పుడైతే సత్యదేవ్ వర్సెస్ నంద గోపాల్ కోర్ట్ రూం సీన్స్ వస్తాయో సినిమా పైకి లేస్తుంది. అంతేకాదు పవన్ యాక్షన్ సీన్స్ కూడా ట్రైన్ లో ఫైట్ సూపర్ అనిపిస్తుంది. సినిమా కథకు అనుగుణంగా పవర్ స్టార్ ను చూపించిన విధానం బాగుంటుంది.

పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకున్న అంశాలతో పాటుగా కథ ఎక్కడ దెబ్బ తినకుండా పవర్ ఫుల్ కథగా చెప్పారు వకీల్ సాబ్. ఈ సినిమా విషయంలో డైరక్టర్ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. ఫ్యాన్స్ కు వకీల్ సాబ్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ ఆడియెన్స్ కు సినిమా నచ్చేస్తుంది.

నటీనటుల ప్రతిభ :

సత్యదేవ్ పాత్రలో పవర్ స్టార్ అదరగొట్టారు. మరోసారి తన పవర్ ఫుల్ రోల్ తో ఫ్యాన్స్ ను అలరించారు. పింక్ రీమేక్ పవన్ ఏం చేస్తాడు అనుకున్న వారికి దిమ్మ తిరిగిపొయే ఆన్సర్ ఇచ్చాడు. సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్యా బాగా చేశారు. ప్రకాశ్ రాజ్ కూడా మెప్పించాడు. ఎంపి తనయుడిగా చేసిన వంశీ కృష్ణ ఆకట్టుకున్నాడు. శృతి హాసన్ తన పాత్రకు న్యాయం చేసింది. ఉన్నతలో మెప్పించింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు మెప్పించాయి.

సాంకేతిక వర్గం పనితీరు :

థమన్ మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్. పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి. డైరక్టర్ వేణు శ్రీరాం కు ఓ సాలిడ్ హిట్ పడినట్టే లెక్క. సినిమాలో ఆయన ప్రతిభ చూపాడు. సినిమా కథను పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా మార్చిన విధానం మెప్పిస్తుంది. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. కోర్ట్ సీన్స్ కు విజిల్స్ వేసేలా ఎంగేజ్ చేశారు.

ప్లస్ పాయింట్స్ :

పవర్ స్టార్ పవన్ కల్యాణ్

థమన్ మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

కోర్ట్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ

బాటం లైన్ :

వకీల్ సాబ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసేయొచ్చు..!

రేటింగ్ : 3.5/5

0 thoughts on “వకీల్ సాబ్ రివ్యూ & రేటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *