పుష్ప టీజర్ రికార్డ్ కొట్టిందిగా..!

స్టైలిష్ స్టార్ అకా ఐకాన్ స్టార్ పుష్ప టీజర్ రికార్డ్ కొట్టేసింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన ప్రతాపం చూపించనున్నాడు పుష్ప. పుష్ప టీజర్ 24 గంటల్లో రికార్డ్ వ్యూస్ సాధించింది. బన్నీ కెరియర్ లో హయ్యెస్ట్ వ్యూయర్ కౌంట్ టీజర్ అండ్ లైక్స్ గా Pushpa రికార్డ్ సాధించింది. బన్నీ కెరియర్ లోనే కాదు పుష్ప టీజర్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ లలో నెంబర్ 1 గా నిలిచింది.

ఇక లైక్స్ విషయంలో మాత్రం సెకండ్ ప్లేస్ లో నిలిచింది. పుష్ప (Pushpa) టీజర్ ఆల్ ఓవర్ ఇండియాతో పోల్చుకుంటే కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ లో పుష్ప ఉంది. టీజర్ తోనే ఇన్ని రికార్డులను కొట్టిన పుష్ప కచ్చితంగా సినిమాతో మరిన్ని సంచలనాలు సృష్టిస్తాడని చెప్పొచ్చు. పుష్ప టీజర్ తో రికార్డ్ సాధించిన బన్నీ తన స్టామినా ఏంటన్నది టీజర్ తోనే చూపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *