Corona Effect సెల్ఫ్ ఐసోలేషన్ లో రాం చరణ్, మహేష్, ప్రభాస్..!

టాలీవుడ్ పై కరోనా (Corona) సెకండ్ వేవ్ ప్రభావం బాగా చూపిస్తుంది. ఇప్పటికే కొంతమంది స్టార్స్ కరోనా బారిన పడి సఫర్ అవుతుండగా లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్స్ ముగ్గురు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. రాం చరణ్ వ్యక్తిగత వ్యానిటీ డ్రైవర్ కరోనాతో మృతి చెందడంతో చరణ్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఒంటరిగా తను మాత్రమే ఒక గదిలో ఉంటున్నాడట చరణ్. ఇక మరోపక్క ప్రభాస్ హెయిర్ స్టైలిష్ కు కరోనా సోకడంతో ప్రభాస్ కూడా క్వారెంటైన్ లో ఉన్నాడని తెలుస్తుంది.

మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కూడా Corona బారిన పడటంతో మహేష్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ముగ్గురు స్టార్స్ ఇలా తమకు తామే సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లి షాక్ ఇస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. స్టార్స్ కూడా ఈ సెకండ్ వేవ్ తో అన్ని షూటింగ్స్ క్యాన్సల్ చేసి ఇంటి దగ్గరే ఉంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *