Monday, September 27

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!

RRR

బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు.

సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే తారాస్థాయి అంచనాలను ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు రైటర్ విజయేంద్ర ప్రసాద్.

ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోలతో ఒక పాట ఉంటుందని అది మరో పాతికేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు.

అంతేకాదు RRR సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. హీరో, విలన్ కొట్టుకుంటే మనం హీరోకి సపోర్ట్ చేస్తాం కాని ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు.

సినిమా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తుందని చెప్పారు విజయేంద్ర ప్రసాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *