రౌడీ బేబీ 1 బిలియన్ మార్క్..!

సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే కేవలం సినిమా వరకే కాదు ఆ సినిమాలో సాంగ్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయి. ఈ క్రమంలో ఆమె చేసిన సినిమాలో ఏదో ఒక సాంగ్ ట్రెండ్ అవుతూ వచ్చింది. ఫిదా సినిమాలో వచ్చిందే సాంగ్ సూపర్ వ్యూస్ సాధించగా మారి 2లో రౌడీ బేబీ (Rowdy Baby) సాంగ్ సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా ఈ సినిమా మరో సంచలన రికార్డ్ సృష్టించింది. 1 బిలియన్ మార్క్ వ్యూస్ తో రౌడీ బేబీ సత్తా చాటింది.

ధనుష్ హీరోగా వచ్చిన మారి 2 సినిమాలో Rowdy Baby సాంగ్ ను ప్రభుదేవా మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. 100 కోట్ల వ్యూస్ సాధించిన సౌత్ సినిమాగా టాప్ లో నిలిచింది రౌడీ బేబీ. ఇక సాయి పల్లవి సాంగ్స్ అంటే రికార్డులు పక్కా అనేలా మరోసారి ప్రూవ్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *