Monday, September 27

Santosh Shoban ఏక్ హిట్ తో ఏకంగా 3 ఆఫర్లు..!

Santosh Shoban

డైరక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా ఈమధ్యనే రిలీజైన సినిమా ఏక్ మిని కథ.

యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను కార్తీక్ రాప్రోలు డైరెక్ట్ చేశారు. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాధీ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. స్మాల్ పెనీస్ సిండ్రోం తో బాధపడే ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది చాలా ఫన్నీగా చూపించారు.

అడల్ట్ కంటెంట్ కథని ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని చూసేలా తెరకెక్కించారు. తను నేను, పేపర్ బోయ్ సినిమాలతో రెండు ప్రయత్నాలు చేసిన సంతోష్ శోభన్ వాటితో కమర్షియల్ గా సక్సెస్ అవలేదు కాని ఏక్ మిని కథతో హిట్ అందుకున్నాడు.

అంతేకాదు ఏక్ మిని కథ హిట్ తో హీరో Santosh Shobanకి 3 కొత్త సినిమా ఆఫర్లు వచ్చాయని తెలుస్తుంది. అందులో వైజయంతి బ్యానర్ లో నందిని రెడ్డి డైరక్షన్ లో సినిమా ఉందని టాక్. మొత్తానికి ఏక్ హిట్ తో క్రేజీ ఆఫర్లు పొందాడు సంతోష్ శోభన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *