Tuesday, July 27

Tag: Movies

జస్ట్ ఇమాజిన్.. వకీల్ సాబ్ నాగార్జున అయితే..?
Telugu Movie News

జస్ట్ ఇమాజిన్.. వకీల్ సాబ్ నాగార్జున అయితే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరాం కాంబినేషన్ లో వచ్చిన సినిమా వకీల్ సాబ్ (Vakeel Saab). బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. సినిమా డైరక్టర్ వేణు శ్రీరాం ఈ సినిమా మూల కథను పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా మార్చినట్టు తెలుస్తుంది. ఇలాంటి కథను పవర్ స్టార్ రేంజ్ ఉన్న హీరో ఒప్పుకోవడం శభాష్ అంటున్నారు. అయితే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే మాత్రం డైరక్టర్ వేణు శ్రీరాం ఈ సినిమాను కింగ్ నాగార్జునతో తీయాలని అనుకున్నారట. నాగార్జున చేసిన ఈ కథకు న్యాయం జరిగేది అయితే పవన్ కళ్యాణ్ కాబట్టే Vakeel Saab సినిమాకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని చెప్పొచ్చు. పవన్ కాకుండా నాగార్జున నటించినా సరే న్యాయం జరిగేది అంటున్నారు. ...
రిస్క్ లో పడ్డ అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్.. ఎంత ఘోరమంటే..!
Telugu Movie News

రిస్క్ లో పడ్డ అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్.. ఎంత ఘోరమంటే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు వారు చేసిన పనుల వల్ల కొద్దిగా రిస్క్ లో పడ్డారు. అదేంటి వారు ఏం చేసినా పర్ఫెక్ట్ గా ఉంటుందిగా అలాంటిది వారు ఎందుకు రిస్క్ లో పడతారని అనుకోవచ్చు. వారు ఏం చేసినా పర్ఫెక్ట్ గా.. ప్లానింగ్ గా ఉంటుంది.. అది వారి సినిమాల వరకే అలా ఉంటుంది. పక్క వారి సినిమాల మీద కాదు. అలా పక్క సినిమాల మీద నమ్మకంగా చెప్పి రిస్క్ లో పడినట్టు చెప్పుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే రీసెంట్ గా వచ్చిన కార్తికేయ చావు కబురు చల్లగా.. శ్రీ సిం హా తెల్లవారితే గురువారం సినిమాలు రెండు ఫ్లాప్ అయ్యాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వచ్చిన చావు కబురు సినిమా ఆ బ్యానర్ లో మొదటి డిజాస్టర్ గా మిగిలింది. మత్తువదలరా సినిమాతో మెప్పించిన శ్రీ సింహా సెకండ్ మూవీతో నిరాశపరచాడు. ఈ సినిమాలకు దగ్గర ఉండి ప్రమోట్ చేసింది అల్లు అర్జున్, NTR. గీతా ఆర్ట్స్ కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్...
Telugu Movie News

అతడు.. ఖలేజా.. ఈసారి ఏం తీస్తారో..?

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్.. సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే.. అబ్బో ఇంకేమైనా ఉందా రికార్డులు క్రియేట్ చేయరు.. అతడుతో అదరగొట్టి ఖలేజాతో టార్గెట్ మిస్సైనా బుల్లితెర మీద.. ప్రతి ప్రేక్షకుడి హృదయాల్లో నువ్వు దేవుడు సామి అనిపించుకున్న త్రివిక్రం.. మహేష్ కాంబో మరోసారి రిపీట్ అవబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా పూర్తి చేసే పనిలో మహేష్.. తారక్ తో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లేలా త్రివిక్రం ఎవరి సినిమాల బిజీలో వారున్నారు. అయితే వారు కమిటైన సినిమాలు పూర్తి కాగానే వీరిద్దరు కలిసి సినిమా చేస్తారని తెలుస్తుంది. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ తన నెక్స్ట్ సినిమా అసలైతే రాజమౌళితో అనుకున్నాడు. అయితే జక్కన్నతో సినిమా అంటే రెండు మూడేళ్లు రాసిచ్చేయాల్సిందే. అందుకే మహేష్ రాజమౌళి సినిమాకు ముందు మరో సినిమా అనుకుంటున్నాడు. అది త్రివిక్రం డైరక్షన్ లోనే...
Telugu Movie News

చరణ్ బర్త్ డే.. RRR నుండి అదిరిపోయే గిఫ్ట్..!

బాహుబలి తర్వాత ఎలాంటి గ్రాఫిక్స్ లేని ఓ చిన్న సినిమా తీస్తానని చెప్పిన రాజమౌళి బాహుబలిని మించేలా ఆర్.ఆర్.ఆర్ షురూ చేశాడు. ఒక హీరోతోనే అద్భుతాలు సృష్టించగల ఆయన ఈసారి ట్రిపుల్ ఆర్ కోసం ఇద్దరు సూపర్ హీరోస్ ను సెలెక్ట్ చేశాడు. అంతేకాదు ఇద్దరు రియల్ లైఫ్ హీరోల కథతో కల్పిత కథతో ఆర్.ఆర్.ఆర్ సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి సంచలనాలు మొదలయ్యాయి. తారాస్థాయిలో అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో తారక్. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాం చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన భీం, రామరాజు టీజర్లు సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేశాయి. ఇక లేటెస్ట్ గా మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా మరో స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఆల్రెడీ రామరాజు టీజర్ లో చరణ్ లుక్ చూపించిన జక్కన్న ఈసారి ఆయన డైలాగ్ టీజర్ ను వదులుతారని తెలుస్తుంది. సినిమాలో చర...
రామ్ తో బేబమ్మ ఫిక్స్..!
Movie news

రామ్ తో బేబమ్మ ఫిక్స్..!

వరుస ఫ్లాపులతో కెరియర్ లో వెనకపడ్డ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ఇచ్చాడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్. టెంపర్ తర్వాత పూరీ అందుకున్న హిట్ సినిమా కూడా ఇదే. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవడం ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన రెడ్ సినిమా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడం రామ్ లో మంచి జోష్ వచ్చింది. ఇక తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ డైరక్టర్ లింగుసామితో ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన బేబమ్మ అదేనండి కృతి శెట్టిని సెలెక్ట్ చేశారు. రామ్ తో కృతి శెట్టి ఈ పెయిర్ ఆడియెన్స్ కు మంచి జోష్ ఇస్తుందని చెప్పొచ్చు. కృతి శెట్టి తెలుగులో టాప్ హీరోయిన్ అవుతుందని ఆమెకు వస్తున్న ఆఫర్లు చూసి చెప్పొచ్చు. ఉప్పెన రిలీజ్ అవకుండానే నాని శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు చేస్తుంది. ...
సుకుమార్ కు చుక్కలు చూపిస్తున్న అల్లు అర్జున్..!
Movie news

సుకుమార్ కు చుక్కలు చూపిస్తున్న అల్లు అర్జున్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ ముగ్గురు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా తీసుకున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఆగష్టు 13న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా విషయంలో డైరక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ ల మధ్య కొద్దిగా డిస్టబెన్సెస్ వచ్చాయట. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు కాని సినిమా షూటింగ్ మాత్రం చాలా స్లోగా చేస్తున్నారట. బన్నీ మాత్రం ఎలాగైనా సరే అనుకున్న డేట్ కు సినిమా వచ్చేయాలని సుకుమార్ మీద ప్రెజర్ చేస్తున్నాడట. లెక్కల మాష్టారు మాత్రం లెక్క సరిగా రావాల్సిందే అని.. లేట్ చేస్తున్నారట. సో తొందరపడాలంటున్న హీరోకి.. మంచి అవుట్ పుట్ రావాలంటే స్లోగా చేయాలంటున్న డైరక్టర్ కి మధ్య సఖ్యత లోపించిందని టాక్. సుకుమార్ తో ఆర్య, ఆర్య 2తో తన టాలెంట్ చూపించాడు బన్నీ. అలాంటిది ఈ ఇద్దరు కలిసి చేస్...